Wednesday, 25 June 2025 07:23:39 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Narsimhulu: లంచం కోసం ఎస్సై అరాచకం.. మహిళ మంగళసూత్రం తాకట్టు పెట్టించిన వైనం

2023లో చిత్తూరు జిల్లాలో ఘటన.. తాజాగా వెలుగులోకి మహిళ నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన ఎస్సై నరసింహులు తన వద్ద లేవని చెప్పడంతో మంగళసూత్రం తాకట్టు పెట్

Date : 19 March 2025 11:56 AM Views : 72

Studio18 News - ANDHRA PRADESH / : లంచం కోసం మహిళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టించిన చిత్తూరు జిల్లా ఎస్సైపై ప్రభుత్వం వేటేసింది. అయితే, ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు, 2023లో గత ప్రభుత్వ హయాంలో జరిగింది. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. 2023 సెప్టెంబర్‌లో తన భార్య అదృశ్యమైనట్టు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ తమ మధ్య కుటుంబ పరమైన వివాదాలు ఉన్నాయని, కాబట్టి భర్తకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని ఎస్సై నరసింహులకు చెప్పింది. అయితే, అలా ఉండాలనుకుంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో మెడలోని మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వాలని కోరాడు. అంతేకాదు, తనకు తెలిసిన తాకట్టు వ్యాపారి వద్దకు పంపి మంగళసూత్రాన్ని కుదువ పెట్టించాడు. అప్పటికప్పుడు ఆమె ఫోన్ పే నుంచి రూ. 60 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. అయితే, విషయం బయటపడటంతో ఆ తర్వాత రామన్న అనే కానిస్టేబుల్ ద్వారా వడ్డీ సహా ఆమెకు నగదు తిరిగి ఇచ్చేశాడు. అలాగే, కమ్మపల్లెలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని యువరాజులు నాయుడిని హత్యాయత్నం కేసులో ఇరికించేందుకు ఎస్సై నరసింహులు మరో వర్గం నుంచి రూ. 7 లక్షలు తీసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన యువరాజులుపై కేసు నమోదు కావడంతో ఆయన అమెరికా వెళ్లే అవకాశం కోల్పోయాడు. దీంతో అతడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి అతడు చెప్పింది నిజమేనని నిర్ధారించారు. అలాగే, మరో కేసులో రూ. 3 లక్షల విలువైన వెదురుకర్రలు దొంగిలించారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా తప్పుడు కేసుగా పేర్కొంటూ దానిని మూసేశారు. తాజాగా, ఈ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో అనంతపురం డీఐజీ షేముషీ బాజ్‌పేయి.. చౌడేపల్లె సీఐతో విచారణ జరిపించారు. ఈ సందర్భంగా ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు. ఎస్సై నరసింహులు ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :