Studio18 News - ANDHRA PRADESH / : కర్నూలులో ఏర్పాటు కావాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి, హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని గుర్తు చేశారు. అమరావతికి హైకోర్టును తరలించడం సరికాదని అన్నారు. కర్నూలులో బెంచ్ ను ఏర్పాటు చేయడం రాయలసీమకు అన్యాయం చేయడమేనని చెప్పారు. కడప కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించారని... కడపలో ఉంటే ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజధానిని, హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తున్నందువల్ల... రాయలసీమ ప్రాంతంలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రాంతీయ విభేదాలు తలెత్తి... మళ్లీ వేర్పాటువాదం బలపడే ప్రమాదం ఉందని అన్నారు.
Also Read : ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్స్ మధ్య గొడవ.. గినియాలో వంద మంది మృతి
Admin
Studio18 News