Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వివాహేతర సంబంధాలు విషాదాలకు దారితీస్తున్నాయి. దారుణ హత్యలకు కారణమవుతున్నాయి. అనునిత్యం వెలుగుచూస్తున్న ఈ తరహా ఘటనలు సమాజంలో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా నరసింహ అనే వీఆర్ఏను బాబు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. నరసింహ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చివేశాడు. ఈ ఘటనలో నరసింహ అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు బాబుని అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నామని వివరించారు. కాగా ఈ ఘటనలో నరసింహ భార్య సుబ్బలక్షమ్మ కూడా తీవ్రంగా గాయపడిందని వెల్లడించారు. ఆమె ప్రస్తుతం వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని వివరించారు.
Admin
Studio18 News