Sunday, 08 March 2026 10:17:12 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Chandrababu Naidu: ఏపీలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ... టీటీడీకి కొత్త ఈవో

Date : 08 September 2025 07:38 PM Views : 254

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ లకు స్థానచలనం టీటీడీ నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకం ప్రస్తుత ఈవో శ్యామలరావు జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టిన ప్రభుత్వం పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగింత ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ బదిలీలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా సీనియర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా పనిచేస్తున్న శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును నియమించారు. రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్ కుమార్ మీనా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇతర ముఖ్య నియామకాల్లో భాగంగా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌ను, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్‌ను ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబును నియమించారు. ఎండోమెంట్ రెవెన్యూ కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించారు. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్ అధికారుల పనితీరుపై సమీక్షలు జరిపారు. పరిపాలనలో వేగం పెంచేందుకు, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పనితీరును ప్రామాణికంగా తీసుకుని, సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించాలనే లక్ష్యంతో ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :