Saturday, 07 March 2026 08:51:07 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Jagan: మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడిన జగన్

Date : 15 September 2025 07:27 PM Views : 119

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఇంజినీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జగన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయమని ట్వీట్ దేశం గర్వించదగ్గ నిపుణుడు అని కొనియాడిన జగన్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంజినీర్లకు ‘ఇంజినీర్స్ డే’ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను జగన్ స్మరించుకున్నారు. "దేశం గర్వించదగ్గ ఇంజినీరింగ్ నిపుణులు, ఎన్నో తాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు" అని తన పోస్టులో పేర్కొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజినీరింగ్ మేధావిగా పేరుగాంచిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజైన సెప్టెంబర్ 15వ తేదీని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ సందర్భంగా దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్రను పలువురు గుర్తుచేసుకుంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :