Monday, 02 December 2024 05:27:08 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు చమత్కారం.. పగలబడి నవ్విన మోదీ!

Date : 09 October 2024 12:03 PM Views : 18

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ కావడం ఎంతటి దుమారాన్ని రేపిందో తెలిసిందే. ఈ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తజనం విస్మయం చెందగా.. హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ అంశం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రాజేసింది. ప్రస్తుతం ఈ వివాదంపై విచారణ కొనసాగుతోంది. ఈ లడ్డూ ప్రసాదం విషయమై సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మోదీ వద్ద చంద్రబాబు సరదాగా చేసిన వ్యాఖ్యలు నవ్వుల పువ్వులు పూయించాయి. ఈ లడ్డూలో కల్తీ లేదని, వందకు వందశాతం పవిత్రమైనదని, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేశామని చంద్రబాబు అనడంతో మోదీ నవ్వు అందుకున్నారు. బాబు చమత్కారానికి మోదీ విరగబడి నవ్వారు. మరోవైపు విశిష్ట గుర్తింపు పొందిన అరకు కాఫీ బ్రాండ్‌కు మరింత ప్రాచుర్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ కాఫీ పౌడర్ బాక్స్‌ను ప్రధాని మోదీకి చంద్రబాబు తన పర్యటనలో అందజేశారని తెలిసింది. అరకు కాఫీ అంటే తనకు చాలా ఇష్టమంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 2016లో విశాఖపట్నంలో అప్పుడు సీఎం ఉన్న చంద్రబాబు, ఇతరులతో కలిసి కాఫీ తాగిన ఫొటోలను ఆయన షేర్ చేసిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు