Friday, 13 December 2024 09:23:06 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Jetwani: జెత్వానీ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు ఐపీఎస్ లను నిందితులుగా చేర్చిన పోలీసులు

Date : 23 September 2024 03:02 PM Views : 33

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను ఈ తెల్లవారుజామున పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా విద్యాసాగర్, ఏ2గా అప్పట్లో జెత్వానీ కేసును దర్యాప్తు చేసిన విచారణాధికారి సత్యనారాయణ, ఏ3గా పీఎస్సార్ ఆంజనేయులు, ఏ4గా కాంతి రాణా, ఏ5గా విశాల్ గున్నీ పేర్లను పేర్కొన్నారు. మరోవైపు, కుక్కల విద్యాసాగర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విద్యాసాగర్ ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాంతి రాణా తాతా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రేపటి వరకు కాంతి రాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆయన ముందస్తు బెయిల్ పై హైకోర్టు రేపు తీర్పును వెలువరించనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు