Studio18 News - ANDHRA PRADESH / : శ్రీశైలం : ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి కెనరా బ్యాంక్ అధికారులు బొలెరో మ్యాక్స్ పికప్, బొలెరో క్యాంపర్ వాహనాలను విరాళంగా అందించారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావుకు కెనరా బ్యాంక్ కర్నూలు ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుశాంత్ కుమార్ వాహనాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. రెండు వాహనాల విలువ సుమారు రూ.21.50 లక్షలకుపైగా ఉంటుందని తెలిపారు. ఆదివారం ఉదయం గంగాధర మండపం వద్ద వాహనాలకు వాహన పూజలు చేయించి.. వాటిని ఈవోకు అందజేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు నాగేశ్వరరావు కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకటేశ్ గౌడ్, శ్రీశైలం బ్రాంచ్ మేనేజర్ హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. దేవస్థానానికి వివిధ అవసరాల కోసం వాహనాలను అందించిన బ్యాంక్ అధికారులకు శ్రీశైల క్షేత్ర అధికారులు ధన్యవాదాలు తెలిపారు.
Admin
Studio18 News