Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతోందంటూ వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. నువ్వు ఉండే బెంగళూరులో ఏమో కానీ... ఏపీలో మాత్రం దొరుకుతోందని తెలిపింది. ఇసుక, మద్యం గురించి నీవు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత మంచిదని హితవు పలికింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి... వందల మంది ఆత్మహత్యకు కారణమయ్యావని విమర్శించింది. నీ ఇసుక దోపిడీకి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదయిందని, విచారణ కూడా జరుగుతుందని టీడీపీ తెలిపింది. ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు వస్తుందని చెప్పింది. పాలన, పాలసీల గురించి మాట్లాడే హక్కు నీకు లేదని వ్యాఖ్యానించింది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై కూడా త్వరలోనే విచారణ ప్రారంభమవుతుందని తెలిపింది.
Admin
Studio18 News