Thursday, 12 March 2026 01:32:18 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Pinnelli Ramakrishna Reddy: కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు

Date : 01 December 2025 07:01 PM Views : 376

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : గుండ్లపాడు జంట హత్యల కేసులో కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కీలక పరిణామం విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించిన వెంకట్రామిరెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు కోర్టు ఆదేశం ఇంకా లొంగిపోని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ8 నిందితుడిగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి సోమవారం పల్నాడులోని స్థానిక కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటరిగా కోర్టుకు వచ్చిన వెంకట్రామిరెడ్డి, న్యాయమూర్తి ఎదుట లొంగిపోతున్నట్లు తెలిపారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. దీంతో, ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు ఏ8, ఏ9 నిందితులుగా ఉన్నారు. గతంలో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందగా, దానిని పోలీసులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం రెండు రోజుల క్రితం వారి బెయిల్‌ను రద్దు చేసింది. రెండు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోయి, విచారణకు సహకరించాలని ఆదేశించింది. వెంకట్రామిరెడ్డి లొంగిపోయినప్పటికీ, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా లొంగిపోలేదు. సుప్రీంకోర్టు విధించిన గడువు ఇంకా ఉండటంతో ఆయన హైదరాబాద్ లేదా బెంగళూరులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మే నెలలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీకి చెందిన ఇద్దరు సోదరులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 10 మందిపై కేసు నమోదు కాగా, పిన్నెల్లి సోదరులు కూడా నిందితులుగా ఉన్నారు. వెంకట్రామిరెడ్డి లొంగుబాటుతో కేసు దర్యాప్తు వేగవంతం కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :