Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Nandigama Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో జైలులో ఉన్న సురేశ్ కు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు శుక్రవారం మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో 2021లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను మంగళగిరి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. కాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును నందిగం సురేశ్ ఆశ్రయించాడు. దీంతో బుధవారం పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు తీర్పును శుక్రవారంకు రిజర్వు చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సురేశ్ కు బెయిల్ ఇవ్వొద్దని, ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉందని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, గురువారంతో సురేశ్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో గుంటూరు జైలు నుంచి పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. బెయిల్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేయడంతో.. కేసును విచారించిన న్యాయమూర్తి మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ పొగించడంతో సురేశ్ ను బందోబస్తు మధ్య గుంటూరు జైలుకు తరలించారు. తాజాగా సురేశ్ బెయిల్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. సురేశ్ తోపాటు వైసీపీ నాయకులు అవుతు శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను సజ్జల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ఏపీ హైకోర్టులో ఈ పిటీషన్ పై విచారణ జరగనుంది.
Admin
Studio18 News