Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అన్నమయ్య జిల్లాలో ఈ రోజు వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్టు సమీపంలో వేలూరు నుండి హైదరాబాద్ వెళుతున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును కడప నుండి రాయచోటి వైపుకు వెళుతున్న సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలియగానే రామాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కడప, రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుకు అడ్డంగా వాహనాలు పడటంతో కడప – రాయచోటి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు జేసీబీ సాయంతో వాహనాలు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
Admin
Studio18 News