Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో మహిళా అఘోరి హల్ చల్ చేసింది. జనసేన ఆఫీసు సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనని తేల్చిచెప్పింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయిచేసుకుంది. అంతకుముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్ లో అఘోరి తన కారును శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్టు తన మొబైల్ కెమెరాలో అఘోరిని వీడియో తీశాడు. ఇది చూసి అఘోరి మండిపడింది. ఆ జర్నలిస్టుపై త్రిశూలంతో దాడి చేసింది. అడ్డు వచ్చిన వారిపైనా దాడి చేసింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : గొంతు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన మహిళకు కలలో కూడా ఊహించని షాక్
Admin
Studio18 News