Monday, 15 December 2025 01:19:26 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

హిందూపురం నాకు ఓ నియోజకవర్గం కాదు... అది నా హృదయ స్పందన: నందమూరి బాలకృష్ణ

Date : 09 May 2025 03:19 PM Views : 232

Studio18 News - ANDHRA PRADESH / : పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హిందూపురం ప్రజల ఆదరణకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హిందూపురంలో జరిగిన సన్మాన సభను జీవితంలో మరువలేని అనుభూతిగా అభివర్ణించారు. ప్రజల అభిమానం తండ్రికి పిల్లలు చూపిన ఆత్మీయతలా అనిపించిందని వ్యాఖ్యానించారు. హిందూపురం కేవలం నియోజకవర్గం కాదని, తన హృదయ స్పందన అని ఉద్ఘాటించారు. ప్రజల ప్రేమకు జీవితాంతం నిస్వార్థ సేవతో బదులిస్తానని భావోద్వేగ హామీ ఇచ్చారు. "పద్మభూషణ్ అనే గౌరవప్రదమైన పురస్కారం లభించిన ఈ ఆనందకరమైన క్షణాల్లో, నా ప్రియమైన హిందూపురం ప్రజలు చూపిన ఆత్మీయత, ప్రేమ, ఆదరణ... నాకు చిరకాలంగా గుర్తుండిపోయే అనుభూతిని ప్రసాదించాయి. మీరు ఏర్పాటు చేసిన సన్మాన సభ... హృదయాన్ని తాకే మధుర ఘడియలు… నా జీవితంలో మరువలేని అనుభవంగా నిలిచిపోయింది. అది ఒక నాయకునికి ప్రజలిచ్చే గౌరవం కంటే... ఒక తండ్రికి తన పిల్లలు చూపే ఆత్మీయతలా అనిపించింది. మీరు చూపిన ఆ ప్రేమ ఒక శక్తిగా, ఆశీర్వాదంగా మారి, నా జీవితం మొత్తానికీ వెలుగులా నిలుస్తుంది. హిందూపురం నాకు ఓ నియోజకవర్గం కాదు... అది నా హృదయపు స్పందన... నా హృదయంలో చిరకాలంగా తీయగా మోగే జననీ స్వరం... ప్రతి చిరునవ్వులో నన్ను నిలబెట్టిన నిస్వార్థ ప్రేమ స్థలం. మీరు ఇచ్చిన ప్రేమకు బదులివ్వలేను కానీ... జీవితాంతం మీ సేవలో నిస్వార్థంగా ఉండే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. మీరు చూపిన నిస్వార్థ ప్రేమకు నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ఈ గౌరవాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ప్రేమను ఈ జీవితంలో మరచిపోలేను" అని బాలయ్య సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :