Studio18 News - ANDHRA PRADESH / : తిరుమల శ్రీవారి ఆలయ గగనతలంపై మరోమారు విమానాలు చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఉదయం ఏకంగా మూడు విమానాలు ఆనంద నిలయం మీదుగా ప్రయాణించడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. తిరుమల ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయంపై విమానాలు ప్రయాణించడం నిషిద్ధం. అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం కూడా ఓ విమానం స్వామివారి ఆలయం మీదుగా వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలపై టీటీడీ భద్రతా విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. తరచూ జరుగుతున్న ఈ ఉల్లంఘనల దృష్ట్యా, తిరుమల క్షేత్రాన్ని పూర్తిస్థాయి "నో ఫ్లై జోన్"గా ప్రకటించి, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
Admin
Studio18 News