Thursday, 12 March 2026 12:57:07 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Nara Lokesh: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై అచ్చెన్నాయుడు, గౌతు శిరీషతో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్

Date : 01 November 2025 07:08 PM Views : 215

Studio18 News - ANDHRA PRADESH / Srikakulam : కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఏకాదశి పర్వదినాన జరిగిన ఘటనలో పలువురు భక్తులు మృతి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేశ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ఈ దురదృష్టకర ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏకాదశి రోజున ఇలాంటి ఘోరం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తాను జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో ఫోన్‌లో మాట్లాడినట్లు లోకేశ్ తెలిపారు. బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని, గాయపడిన వారికి అన్ని విధాలా నాణ్యమైన చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. "కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" అని లోకేశ్ పేర్కొన్నారు. పవిత్రమైన ఏకాదశి నాడు ఇలాంటి విషాదం నెలకొనడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :