Friday, 13 December 2024 09:48:43 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Nagababu: ఇలాంటి ద్రోహులను క్షమించకూడదు: నాగబాబు

Date : 21 September 2024 02:42 PM Views : 34

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే అంశం కలకలం రేపింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందిస్తూ... ద్రోహులను క్షమించకూడదని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా నాగబాబు స్పందిస్తూ.. "ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'తిరుమల తిరుపతి దేవస్థానం' ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కానీ... కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు. ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవున్ని నిష్టతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుంది. తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు. అంతటి విశిష్టమైన ప్రసాదాన్ని అందులోను తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో... జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు. అందుకే తితిదేలాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు