Thursday, 12 December 2024 12:50:18 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Honey Trapping Case: విశాఖ హ‌నీట్రాప్ కేసులో పోలీసుల దూకుడు

Date : 07 October 2024 12:21 PM Views : 37

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విశాఖ‌ప‌ట్నం హ‌నీట్రాప్ కేసులో పోలీసులు విచార‌ణను ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి ప‌లువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించే క్ర‌మంలో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. బాధితులు ఇంకా ఎవ‌రైనా ఉంటే వెంట‌నే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని పోలీసులు కోరారు. హైద‌రాబాద్ కేంద్రంగా ఓ ముఠా ఈ వ్య‌వ‌హారాన్ని న‌డిపిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అంద‌మైన యువ‌తుల ఫొటోల‌తో యువ‌కుల‌ను ఆక‌ర్షించి, సామాజిక మాధ్య‌మాల ద్వారా వారిని త‌మ ఉచ్చులో చిక్కుకునేలా చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. బాధితుల‌కు మాద‌క ద్ర‌వ్యాలు ఇచ్చి, వారు మ‌త్తులోకి జారుకున్న త‌ర్వాత యువ‌తులు స‌న్నిహితంగా ఉన్న‌ట్లు ఫొటోలు తీసేవారు. అంతే.. ఆ త‌ర్వాత ఆ ఫొటోల‌ను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయ‌డం చేశారు. త‌ద్వారా వారి నుంచి భారీ మొత్తంలో న‌గ‌దు వ‌సూలు చేశారు. త‌మ ప్రైవేట్ ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తే ప‌రువుపోతుందన్న భ‌యంతో బాధితులు ఆన్‌లైన్ ద్వారా భారీగా డ‌బ్బులు స‌మ‌ర్పించుకున్నారు. ఈ వ్య‌వ‌హారంలో చాలా మంది యువ‌కులు చిక్కుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నిందితుల ఆన్‌లైన్ లావాదేవీల‌పై పోలీసులు నిఘా పెట్టారు. వారి న‌గ‌దు లావాదేవీల‌పై ఆరా తీస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువ‌స్తామ‌ని పోలీసులు వెల్ల‌డించారు. నిందితులు ఎవ‌రైనా స‌రే వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు