Sunday, 08 March 2026 10:49:52 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

మంగళగిరి కోర్టులో నందిగం సురేశ్ ను ప్రవేశపెట్టిన పోలీసులు

Date : 19 May 2025 11:10 AM Views : 390

Studio18 News - ANDHRA PRADESH / : తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా పరిధిలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో రాజు అనే టీడీపీ కార్యకర్తపై దాడి చేశారన్న అభియోగాలతో నందిగం సురేశ్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానంలో హాజరుపరచడానికి ముందు, ప్రొటోకాల్ ప్రకారం నందిగం సురేశ్‌కు మంగళగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా ఆయన రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) స్థాయులను పరిశీలించినట్లు సమాచారం. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత, సురేశ్‌ను ప్రత్యేక భద్రత నడుమ కోర్టుకు తరలించారు. నందిగం సురేశ్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, పోలీసులు అప్రమత్తమై కోర్టు ప్రాంగణం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కోర్టు ఆవరణలోకి ఇతరులను అనుమతించకుండా ఖాళీ చేయించారు. అదే సమయంలో, సురేశ్ అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో, వారిని కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :