Tuesday, 31 March 2026 04:35:00 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Medico Death: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికో మృతి

Date : 05 February 2026 07:19 PM Views : 48

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : విధుల్లో ఉండగానే కడుపునొప్పితో బాధపడ్డ మెడికో ఇంజెక్షన్ చేసిన సహచర విద్యార్థిని అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తున్న యువతి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధినిర్వహణలో ఉన్న ఓ మెడికో అనుమానాస్పద రీతిలో మరణించింది. విధుల్లో ఉండగానే కడుపునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో మరో వైద్య విద్యార్థిని ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ గదిలో విద్యార్థిని మరణించినట్లు గుర్తించిన సహచరులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాకు చెందిన దీపిక ఎంబీబీఎస్ పూర్తిచేసి అనస్తీషియా విభాగంలో పీజీ చేస్తోంది. విజయవాడ వైద్య కళాశాలలో చదువుతున్న దీపిక.. విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఆమె డ్యూటీ చేయాల్సి ఉంది. అయితే, బుధవారం సాయంత్రం డ్యూటీకి వచ్చిన కాసేపటికే కడుపునొప్పిగా ఉందని తోటి వైద్య విద్యార్థులకు చెప్పింది. దీంతో ఓ విద్యార్థిని ఆమెకు ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత విధుల్లో నిమగ్నమైన దీపిక రాత్రి 11.30 గంటల సమయంలో ఆపరేషన్‌ గదిలో బల్లపై పడిపోయింది. వెంటనే ఆమెను పరీక్షించిన సహచరులు.. దీపిక అప్పటికే మరణించిందని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. దీపిక ఆత్మహత్యకు పాల్పడిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. దీపికది అనుమానాస్పద మరణంగా భావిస్తున్నామని, అనంతపురం నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చాక వారి ఫిర్యాదుతో దర్యాప్తు జరుపుతామని చెప్పారు. వైద్య విద్యార్థిని దీపిక మరణంపై మంత్రి సత్యకుమార్‌ విచారం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రితో ఫోన్ లో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :