Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన చర్చించనున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర జలమంత్రి సీఆర్ పాటిల్, 3.30 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రం 4.30 గంటలకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సాయంత్రం 5.15 గంటలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో సమావేశం కానున్నారు. రేపు ఉదయం పార్లమెంట్ లో ప్రధాని మోదీతో పవన్ భేటీ అవుతారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
Also Read : ఢిల్లీని వీడుతూ రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్ట్..!
Admin
Studio18 News