Tuesday, 31 March 2026 04:35:22 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Nara Lokesh: ఆర్డీటీ సేవల‌పై మంత్రి లోకేశ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Date : 24 March 2026 11:40 AM Views : 11

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఈ సంస్థకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) కింద లైసెన్స్ రెన్యువల్ పూర్తయినట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. దీంతో ఆర్డీటీకి విదేశీ విరాళాల స్వీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేర‌కు లోకేశ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్టారు. ఆర్డీటీ సేవలు నిలిచిపోవని గతంలోనే మాట ఇచ్చానని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణం, నిరుపేద పిల్లల చదువు, ఉపాధి, వైద్యం వంటి రంగాల్లో ఆర్డీటీ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు వివరించినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని, దీంతో ఆర్డీటీ రెన్యువల్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులకు లోకేశ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే దశాబ్దాలుగా సేవా స్ఫూర్తితో పనిచేస్తున్న ఆర్డీటీ నిర్వాహకులు మాంచో ఫెర్రర్‌కు అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :