Studio18 News - ANDHRA PRADESH / : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,072 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15,081 కోట్ల పనులకు ఆమోదం తెలపనుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించనుంది. 10 సంస్థల ద్వారా వచ్చే రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, ముందుగా 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది.
Admin
Studio18 News