Monday, 15 December 2025 02:03:43 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

YS Jagan: ఏపీ రాజకీయాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. మావాళ్లు కూడా ఆ బుక్స్ మెయింటెన్ చేస్తున్నారు.

Date : 09 October 2024 01:22 PM Views : 300

Studio18 News - ANDHRA PRADESH / : YS Jagan Comments : ఏపీ రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం పార్టీ నాయకుల సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో వైసీపీ కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలని, పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్నింటికీ తట్టుకొని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిని ఇంచార్జిగా నియమించినట్లు జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్న జగన్.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఇంటికీ మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలమని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలుచేసే పార్టీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. బడ్జెట్‌తోపాటు సంక్షేమ క్యాలండర్‌కూడా విడుదలచేసేవాళ్లం. ప్రతినెలలో క్రమం తప్పకుండా బటన్‌ నొక్కి పథకాలు అమలు చేశాం. ఇది కేవలం ఐదేళ్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పాలనలోనే జరిగిందని జగన్ అన్నారు. ఐదేళ్ల పాలనలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నాం. కోవిడ్‌ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. రెండేళ్లపాటు కోవిడ్‌తో యుద్ధం చేశాం. రాబడులు తగ్గిపోయాయి, ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అయినా ఏరోజుకూడా సాకులు చూపకుండా పథకాలు అమలు చేశామని జగన్ గుర్తు చేశారు. ప్రతి ఇంట్లోనూ వైసీపీ ప్రభుత్వం హయాంలో అందించిన పథకాలపై చర్చ జరుగుతుంది. జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోందని జగన్ పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయాలి.. సంస్థాగతంగా అత్యంత బలంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. కష్టాల నుంచే నాయకులు పుడతారు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం. కష్టాలు ఎక్కువ కాలం ఉండవని అన్నారు. లోకేశ్ రెడ్‌బుక్‌ పై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్‌ ఏమైనా పెద్దపనా? ఎప్పుడూ లేని దుష్టసంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లుకూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం. పార్టీకి మంచి చేసినవారిని, కష్టపడే వారి పేర్లనుకూడా రాసుకుంటున్నాం. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని జగన్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :