Saturday, 14 December 2024 03:13:39 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Sim Cards: సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో!

Date : 17 September 2024 03:28 PM Views : 52

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మొబైల్ సిమ్ కార్డులను కొనుగోలు చేసే నియమాలు సులభతరం అయ్యాయి. ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వోడా ఫోన్, ఐడియా కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ (డిఓటీ) ఇప్పుడు దీన్ని పూర్తిగా పేపర్ లెస్ గా మార్పు చేసింది. వినియోగదారులు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలనుకున్నా లేక ఆపరేటర్‌ని మార్చాలని ఆలోచిస్తున్నా ఇకపై టెలికాం కంపెనీ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుండి సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. వినియోగదారుల వ్యక్తిగత పత్రాలతో మోసాన్ని నిరోధించడంతో పాటు, డిజిటల్ ఇండియా కింద పూర్తిగా కాగిత రహిత వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ వినియోగదారుల కోసం ఇ – కెవైసీ (నో యువర్ కస్టమర్) అలాగే సెల్ప్ కేవైసీని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. వినియోగదారులు తమ నంబర్‌ను ప్రీపెయిడ్ నుండి పోస్టు పెయిడ్‌కి మార్చుకోవడానికి కూడా టెలికాం ఆపరేటర్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. వినియోగదారులు ఇప్పుడు ఓటీపీ అధారంగా సేవ ప్రయోజనాలను పొందవచ్చు. వన్ టైమ్ పాస్‌వర్డ్ తోనే ఎటువంటి ఫోటో కాపీ లేదా పత్రాన్ని భాగస్వామ్యం చేయకుండా కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఈ పూర్తి డిజిటల్ ప్రక్రియ వినియోగదారుల పత్రాల దుర్వినియోగాన్ని నివారిస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు