Studio18 News - ANDHRA PRADESH / : ఎన్నికలు ఉన్నప్పుడే ఎన్నో హామీలు ఇస్తారు, ప్రజలపై ప్రేమ చూపిస్తారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రశ్నించే వారిని ప్రభుత్వ పెద్దలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కప్పం కట్టనిదే ఏపీలో పనులు జరగడం లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దోచుకునే పంచుకు తినే మాఫియా నడుస్తోందని అన్నారు. ఇసుక, మద్యం ఇలా ఎక్కడ చూసినా దోపిడినే జరుగుతోందని జగన్ ఆరోపించారు. ప్రజల ఆశలతో చెలగాటం ఆడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని చెప్పారు. హామీలపై ప్రజలు నిలదీస్తారని భయపడుతున్నారని అన్నారు. ఎక్కడ ఎవరికి ఉచిత ఇసుక ఇస్తున్నారని నిలదీశారు. రాష్ట్ర ఆదాయం సున్నా అని చెప్పారు.
Admin
Studio18 News