Saturday, 07 March 2026 08:33:51 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

రేష‌న్ బియ్యం వ‌ద్ద‌నుకునే వారికి న‌గ‌దు: మంత్రి కొల్లు ర‌వీంద్ర‌

Date : 02 June 2025 11:19 AM Views : 216

Studio18 News - ANDHRA PRADESH / : ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ ద్వారా ఇచ్చే బియ్యం విష‌య‌మై ప్ర‌భుత్వం కీల‌క ఆలోచ‌న చేస్తుంద‌ని మంత్రి కొల్లు ర‌వీంద్ర వెల్ల‌డించారు. రేష‌న్ బియ్యం వ‌ద్ద‌నుకునే కార్డుదారుల‌కు న‌గ‌దు ఇచ్చే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆయ‌న నిన్న‌ కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలోని రాజ‌పేట‌లో చౌక‌ధ‌ర‌ల దుకాణం ద్వారా రేష‌న్ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌టీసీ ఛైర్మ‌న్ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావు, డీసీఎంఎస్ ఛైర్మ‌న్ బండి రామ‌కృష్ణ, జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కొల్లు ర‌వీంద్ర మాట్లాడుతూ... గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పేద‌ల బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించి వేల‌కోట్ల రూపాయ‌లు దోచేశారు. ఇంటింటి రేష‌న్ పేరుతో కార్డుదారుల‌నూ తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేశారు. అందుకే రేష‌న్ బియ్యం మాఫియాను అరిక‌ట్ట‌డంతో పాటు ప్ర‌జ‌ల‌ను నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కూట‌మి స‌ర్కార్ చౌక‌ధ‌ర‌ల దుకాణాల ద్వారా రేష‌న్ పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌పై ప్ర‌తి నెలా ఒక‌టి నుంచి ప‌దిహేనో తేదీ వ‌ర‌కు చౌక‌ధ‌ర‌ల దుకాణాల్లో రేష‌న్ అందుబాటులో ఉంటుంది. కార్డుదారుల ఇష్ట‌ప్రకారం బియ్యం బ‌దులు న‌గ‌దు, రాగులు, స‌జ్జ‌లు ఇత‌ర చిరుధాన్యాలు ఇచ్చేలా ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది అని మంత్రి వెల్ల‌డించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :