Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆలయంలో విధుల నిర్వహణ విషయమై ఇద్దరు పూజారుల మధ్య మాటామాటా పెరిగింది.. ఆవేశం పట్టలేక ఒకరిపై మరొకరు చేయిచేసుకోవడంతో భక్తులు ఇద్దరినీ విడదీశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా తలకోన సిద్దేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్తీకమాసం సందర్భంగా తలకోన ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో గర్భగుడిలో పూజలు చేస్తే సంభావన ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు పూజారులు పోటీ పడ్డారు. ఈ రోజు పూజలు నిర్వహించే బాధ్యత తనదంటే తనదని గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇంతలో అక్కడున్న భక్తులు వచ్చి పూజారులను విడదీశారు. ఈ నెల 10న ఈ గొడవ జరగగా.. తాజాగా ఆలయంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చింది.
Also Read : ప్లీజ్ .. మా ఛాన్సులు పోగొట్టకండి: 'జబర్డస్త్' వెంకీ మంకీ!
Admin
Studio18 News