Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ నాడు స్వామి వారికి అలంకరించేందుకు గానూ తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను చెన్నై నుంచి హిందూ ధర్మార్థ సమితి సోమవారం తీసుకువచ్చింది. సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న వీటికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. చెన్నై నుంచి తీసుకొని వచ్చిన ఈ గొడుగులను ఆలయం ముందు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ట్రస్టీ ఆర్ ఆర్ గోపాల్ నేతృత్వంలో అందజేశారు. టీటీడీ అధికారులు గొడుగులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన తర్వాత ఆలయంలోకి తీసుకువెళ్లారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.
Admin
Studio18 News