Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో వెంకటరెడ్డిని మూడు రోజుల పాటు ఏసీబీ అధికారుల కస్టడీకి కోర్టు అనుమతి నిచ్చింది. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గనుల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆయనకు రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. కాగా, వెంకటరెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బుధవారం నుండి మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి నిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Admin
Studio18 News