Thursday, 12 March 2026 12:37:49 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu Naidu: అంతపెద్ద తుపానులో ఎక్కువ ప్రాణనష్టం లేకుండా చూశాం... కానీ ఇవాళ భారీ ప్రాణ నష్టం జరిగింది: సీఎం చంద్రబాబు

Date : 01 November 2025 06:20 PM Views : 218

Studio18 News - ANDHRA PRADESH / Sri Satyasai : కాశీబుగ్గ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం ప్రైవేటు వ్యక్తుల బాధ్యతారాహిత్యం వల్లే ఈ ఘోరం జరిగిందని వ్యాఖ్య ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే ప్రాణనష్టం ఉండేది కాదన్న సీఎం సత్యసాయి జిల్లా సభలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటింపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ దుర్ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటనను ప్రస్తావించారు. అంత పెద్ద తుపానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని... తీరా చూస్తే ఈరోజు ప్రైవేటు వ్యక్తుల బాధ్యతా రాహిత్య చర్యలతో ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగిందని... ఇది అత్యంత బాధాకరమని అన్నారు. కాగా, ప్రజావేదిక సభ వేదికగా కాశీబుగ్గ మృతులకు సంతాపంగా రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. ఆలయ నిర్వాహకులు ముందుగానే పోలీసులకు చెప్పి ఉంటే భక్తులను క్యూలైన్లలో నియంత్రించేందుకు అవకాశం ఉండేదని చంద్రబాబు అన్నారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :