Studio18 News - ANDHRA PRADESH / : సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి అప్పగించింది. ఇప్పటి వరకు ఈ కేసులో వాదనలు విన్న సీజేఐ బెంచ్.. తాజాగా మరో బెంచ్ ముందుకు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఈ కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలంటూ రఘురామకృష్ణరాజు మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే, సుప్రీంకోర్టు బెంచ్ మార్పు నిర్ణయానికి రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషనే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియరాలేదు.
Also Read : లగచర్ల ఘటన.. 55 మంది అరెస్ట్
Admin
Studio18 News