Tuesday, 31 March 2026 04:35:21 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Vijay: పెరంబూర్ నుంచి విజయ్ ఎన్నికల ప్రచారం.. తొలి అడుగులు వేస్తున్న టీవీకే

Date : 24 March 2026 12:34 PM Views : 6

Studio18 News - ANDHRA PRADESH / Srikakulam : తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, నటుడు-రాజకీయ నేత విజయ్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రేప‌టి నుంచి చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గంలో ఆయన తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఈ పరిణామం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ప్రచార కార్యకలాపాల కోసం విజయ్ ఇప్పటికే కొడుంగైయూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్‌లో ఒక బంగ్లాను సిద్ధం చేసుకున్నారు. రేపు ఉదయం ఆ నివాసంలో పూజలు నిర్వహించి, అనంతరం పెరంబూర్ నియోజకవర్గంలో పర్యటనకు బయలుదేరనున్నారు. రాబోయే రెండు రోజుల పాటు ఆయన స్థానికులతో మమేకమవుతూ, ఓటర్లను కలిసి మద్దతు కోరనున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల‌ 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్డీఏ వంటి ప్రధాన కూటములు అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశాయి. ఈసారి తమిళనాట ఎన్నికలు చతుర్ముఖ పోటీగా మారే అవకాశం కనిపిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు నామ్ తమిళ్ కట్చి (ఎన్‌టీకే), విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా స్వతంత్రంగా పోటీ చేసే సూచనలు ఉన్నాయి. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సరళిని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :