Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : రాజధాని అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. ఈ మేరకు సీఆర్‌డీఏ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతుల వార్షిక కౌలు మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఎకరానికి వార్షిక కౌలు ఎంత చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని ఇస్తున్నారు. పదేళ్ల పాటు కౌలు చెల్లించాలన్న గడువు ఒప్పందం ముగియడంతో మరో ఐదేళ్లు పెంచాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితమే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియా సమావేశంలో అమరావతి రైతులకు కౌలు చెల్లింపు నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారం నిధుల విడుదలకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది.
Admin
Studio18 News