Wednesday, 04 March 2026 08:45:56 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Kodali Nani: కొడాలి నానిపై కేసు పెట్టిన టీడీపీ నేత కిడ్నాప్.. కృష్ణా జిల్లాలో కలకలం

Date : 08 January 2026 07:29 PM Views : 72

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : గుడివాడ టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ నిర్మానుష్య ప్రదేశంలో ఆయనపై దాడి చేసి, వదిలేసిన దుండగులు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ప్రభాకర్ కిడ్నాప్ వెనుక కొడాలి నాని ఉన్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గుడివాడ టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదులు చేసినందుకే ఈ ఘటన జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... నిన్న ఉదయం 9 గంటలకు ప్రభాకర్ తన బైక్‌పై మచిలీపట్నం వెళుతుండగా పెడన వద్ద కొందరు దుండగులు ఆయనను అడ్డగించి కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి సాయంత్రం వరకు నిర్బంధించి బెదిరింపులకు గురి చేశారు. నిన్న రాత్రి సమయంలో ఆయనను వదిలేశారు. తనను వదిలేసిన తర్వాత... ప్రభాకర్ నేరుగా గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... దుండగులు తనను కొట్టారని తెలిపారు. మరోవైపు, ఈ కిడ్నాప్ వెనుక మాజీ మంత్రి కొడాలి నాని, అబ్కారీ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఉన్నారని ప్రభాకర్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. లిక్కర్ గోడౌన్, లీజు వ్యవహారాల్లో జరిగిన అవినీతిపై కొడాలి నాని, వాసుదేవరెడ్డిలపై పోలీసులకు గతంలో ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ పై వారే దాడి చేయించి ఉంటారని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే, ఈ కేసు విషయంపై మాట్లాడేందుకు ప్రభాకర్ నిరాకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈ కిడ్నాప్ వ్యవహారంపై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నాప్, దాడి వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :