Thursday, 12 March 2026 01:33:43 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్

Date : 09 February 2026 06:52 PM Views : 34

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : విజయ్ దేవరకొండ, రష్మికలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం పెళ్లికి వెళుతున్నారా అని తరుణ్ భాస్కర్‌ని ప్రశ్నించిన మీడియా ప్రతినిధి ఆహ్వానం అందలేదు... వచ్చాక వాట్సాప్ చేస్తాను అందరం వెళదామని వ్యాఖ్య సినీ నటుడు విజయ్ దేవరకొండ పెళ్లికి తనకు ఆహ్వానం అందలేదని ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ వెల్లడించారు. తన కొత్త సినిమా 'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు విజయ్ దేవరకొండ పెళ్లి అంశాన్ని ప్రస్తావించారు. ఈ నెల 26న విజయ్, రష్మికలు వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో, త్వరలో విజయ్ దేవరకొండ వివాహమని తెలిసింది, మీరు వెళుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానిస్తే మీకు కూడా వాట్సాప్‌లో పంపిస్తానని, అప్పుడు కలిసి వెళదామని తరుణ్ భాస్కర్ సమాధానమిచ్చారు. విజయ్, తరుణ్ భాస్కర్ మంచి స్నేహితులు. తరుణ్ దర్శకత్వంలో, విజయ్ హీరోగా 2016లో వచ్చిన 'పెళ్లిచూపులు' చిత్రం ఘన విజయం సాధించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :