Sunday, 08 March 2026 04:12:12 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Manchu Lakshmi: ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న మాట నిజమే: మంచు లక్ష్మీ ప్రసన్న

Date : 18 September 2025 07:38 PM Views : 395

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా 'దక్ష' రేపు విడుదలవుతున్న సినిమా ముంబై లైఫ్ స్టైల్ ఇష్టమని వెల్లడి తనకి సొంతిల్లు లేదన్న లక్ష్మి మంచు లక్ష్మి ప్రధానమైన పాత్రను పోషిస్తూ నిర్మించిన సినిమానే 'దక్ష'. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచు లక్ష్మి బిజీగా ఉన్నారు. తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "కొంత కాలంగా నేను ముంబైలో ఉంటున్నాను. నాకు సంబంధించిన అన్ని పనులను నేను అక్కడి నుంచే చక్కబెడుతున్నాను" అని చెప్పారు. "ముంబై లైఫ్ స్టైల్ నాకు ఇష్టం .. పొద్దున్నే లేచి పనుల కోసం పరిగెత్తడాన్ని నేను ఇష్టపడతాను. ముంబైకి వెళ్లడానికి మా అందరికీ మార్గదర్శి 'రానా'నే. అక్కడ రానాకి ఇల్లు ఉంది .. చరణ్ కి ఇల్లు ఉంది. మా అందరికంటే ముందుగానే సూర్య అక్కడికి వెళ్లారు. ముంబైలో నేను రెంట్ కి ఉంటున్నాను. అక్కడ తాప్సీ .. రకుల్ కలుస్తూ ఉంటారు. నేను ఎక్కడ ఉన్నప్పటికీ నన్ను చూసి ఇతరులు ధైర్యం తెచ్చుకునేలా ఉంటానే తప్ప, పిరికితనంతో బ్రతకమని చెప్పేలా ఉండను" అని అన్నారు. "ఆర్ధిక ఇబ్బందుల కారణంగా నేను ఇల్లు అమ్మకానికి పెట్టినట్టుగా ఒక టాక్ వినిపిస్తోందని అంటున్నారు. అసలు నాకు సొంత ఇల్లే లేదు .. అలాంటప్పుడు ఎలా అమ్మకానికి పెడతాను? ఫిల్మ్ నగర్లో ఉన్నది నాన్న ఇల్లు .. గతంలో నేను అక్కడ ఉన్నాను అంతే. ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న మాట నిజమే. అయితే ఇలాంటి ఒక పరిస్థితి నుంచి ఎలా ఎదగాలో నేర్చుకోవాలనే పట్టుదలతోనే ఉన్నాను" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :