Sunday, 08 February 2026 11:07:29 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

జాతిరత్నాలు దర్శకుడితో విష్వక్సేన్ 'ఫంకీ' చిత్రం ప్రారంభం

విష్వక్సేన్ హీరోగా 'ఫంకీ' సినిమా ప్రారంభం అనుదీప్‌ దర్శకత్వంలో మరో ఎంటర్‌టైనర్‌ జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం

Date : 11 December 2024 03:00 PM Views : 295

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'జాతిరత్నాలు' వంటి హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకున్న అనుదీప్‌ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటి వరకు మాస్‌ సినిమాలు చేస్తూ వచ్చిన హీరో విష్వక్సేన్ కథానాయకుడిగా అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ తాజా చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఫంకీ' అనే గమ్మతైన టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి నాగవంశీ క్లాప్‌ నివ్వగా, కళ్యాణ్‌ శంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత నాగవంశీ బౌండెడ్‌ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ కూడా అందర్ని ఆకట్టుకుంటోంది. 'ఫంకీ' టైటిల్‌తో పాటు ఈ సినిమా జానర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలిసేటట్లుగా పోస్టర్‌ డిజైన్‌ చేసిన విధానం బాగుంది. పూర్తి వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో విష్వక్సేన్ పాత్ర మునుపెన్నడు చూడని విధంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. 2025 జనవరి నుంచి రెగ్యులర్‌ను షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సురేష్‌ సారంగం

Also Read : మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :