Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Making Video of The Raja Saab : మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘ది రాజా సాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. నేడు (అక్టోబర్ 8) దర్శకుడు మారుతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ది రాజా సాబ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రభాస్ నవ్వుతూ కనిపించాడు. హారర్, రొమాంటిక్, కామెడీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2025 ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Admin
Studio18 News