Saturday, 24 January 2026 07:36:37 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

తెలిసి ఏ తప్పు చేయలేదు: సెల్ఫీ వీడియో విడుదల చేసిన ప్రముఖ జానపద గాయని మంగ్లీ

Date : 12 June 2025 11:55 AM Views : 538

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ముందస్తు అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీతో సహా మరికొందరిపై కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై స్పందిస్తూ సింగర్ మంగ్లీ నిన్న రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె పేర్కొంది. నా పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. మద్యం, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. మద్యం, సౌండ్ సిస్టమ్‌కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అవగాహన లేదు. ఎవరైనా చెప్పి ఉంటే అనుమతి తీసుకునేదాన్ని. రిసార్ట్‌లో పార్టీ అనుకోకుండా సడన్‌గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. రిసార్ట్‌లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదు. పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం. నాకు తెలిసి ఎందుకు ఇలా చేస్తాను. మా అమ్మా, నాన్నలను దగ్గర పెట్టుకొని ఇలాంటివి ప్రోత్సహిస్తానా? ఒక రోల్‌ మోడల్‌గా ఉండాలనుకుంటాను కానీ, ఇలాంటివి ఎందుకు చేస్తాను. మీడియా మిత్రులకు నా విన్నపం.. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు.. ప్లీజ్‌’ అంటూ మంగ్లీ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :