Thursday, 12 March 2026 04:34:50 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Devara Movie: 'దేవర' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దుతో విధ్వంసం.. నిర్మాతలకు సరికొత్త తలనొప్పులు

Date : 25 September 2024 12:29 PM Views : 250

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 'దేవర' ప్రీరిలీజ్ ఈవెంట్ గత ఆదివారం హైదరాబాద్ లోని నొవోటెట్ హోటల్ జరగాల్సి ఉంది. అయితే కెపాసిటీకి మించి అభిమానులు పోటెత్తడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. హోటల్ లోని ఫర్నిచర్ ను, సామగ్రిని ధ్వంసం చేశారు. తోపులాటలో హోటల్ లోని అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో నిర్మాతలకు సరికొత్త తలనొప్పులు వచ్చాయి. అభిమానుల ఆగ్రహజ్వాలలతో హోటల్ కు భారీ నష్టం వాటిల్లింది. తమకు వాటిల్లిన నష్టాన్ని చెల్లించాలని 'దేవర' నిర్మాతలను హోటల్ యాజమాన్యం కోరింది. తమకు రూ. 33 లక్షల నష్టం వాటిల్లినట్టు హోటల్ యాజమాన్యం లెక్కకట్టింది. కుర్చీలకే రూ. 7 లక్షల వరకు అయినట్టు సమాచారం. దీంతో పాటు మెయిన్ గ్లాస్, ఎలివేటర్ గ్లాస్, కొన్ని డోర్లు కూడా ధ్వంసమయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. మరోవైపు బిల్లును కాస్త తగ్గించాలని హోటల్ యాజమాన్యాన్ని నిర్మాతలు కోరినట్టు సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :