Saturday, 07 March 2026 08:51:33 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Kalyan Ram: ఆమెను 'అమ్మ' అనే పిలుస్తాను: నందమూరి కల్యాణ్ రామ్

కల్యాణ్ రామ్, విజయశాంతి కాంబోలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి నూతన దర్శకుడు ప్రదీప్ డైరెక్షన్ లో చిత్రం ఈ సినిమాతో విజయశాంతితో తన అనుబంధం బలపడిందన్న కల్యాణ్

Date : 17 March 2025 12:27 PM Views : 317

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కళ్యాణ్ రామ్... విజయశాంతి గురించి మాట్లాడుతూ ఆమెను 'అమ్మ' అని పిలుస్తానని, ఈ సినిమాతో తమ మధ్య అనుబంధం మరింత బలపడిందని అన్నారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తల్లీకొడుకుల మధ్య ప్రేమ, అనుబంధాల గురించి ఈ సినిమాలో చూపించామని తెలిపారు. దర్శకుడు ప్రదీప్ ఈ కథ చెప్పినప్పుడు విజయశాంతి గారినే ఆ పాత్రలో ఊహించుకున్నానని ఆయన అన్నారు. కర్తవ్యం సినిమాలోని వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ సినిమా కథను రూపొందించామని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. విజయశాంతి ఈ సినిమాకు ప్రధాన బలం అని, ఆమె పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించారని కొనియాడారు. విజయశాంతి మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తారని, ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడు ప్రదీప్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రంలో నటించారని ఆమె ప్రశంసించారు. రాజకీయాల్లో ఉన్న విజయశాంతి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆమె 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో నటించారు. ఈ సినిమా టీజర్ సోమవారం ఉదయం విడుదల కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :