Thursday, 12 March 2026 01:29:36 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Ram Charan: రామ్ చరణ్ 'పెద్ది' రిలిజ్ డేట్ మారింది!

Date : 04 February 2026 06:31 PM Views : 33

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మార్చి నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడిన 'పెద్ది' ఏప్రిల్ 30... కొత్త రిలీజ్ డేట్ ప్రకటన మే డే వీకెండ్‌ను టార్గెట్ చేసిన చిత్రబృందం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సానా అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రాన్నిమార్చి 27న విడుదల చేయాలని భావించారు. పవన్ కల్యాణ్ కొత్త చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 26న వస్తున్నట్టు ఇవాళ ప్రకటించిన నేపథ్యంలో, 'పెద్ది' విడుదల తేదీని వెనక్కి జరిపినట్టు తెలుస్తోంది. అయితే, కొత్త విడుదల తేదీ మే డే వీకెండ్‌తో కలిసి వస్తుండటంతో సమ్మర్ సీజన్‌లో సినిమాకు ఇది బాగా కలిసొస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. “అతడి రాక తేదీ మారుతుంది, కానీ అతడి దృఢ సంకల్పం మారదు” అంటూ చిత్రబృందం చేసిన ప్రకటన అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. గ్రామీణ క్రీడా నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :