Thursday, 12 March 2026 04:31:20 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన నాగబాబు

Date : 31 May 2025 12:55 PM Views : 234

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నిర్మాతగా తన కుమార్తె నిహారిక కొణిదెల తొలి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడంపై నటుడు, నిర్మాత నాగబాబు ఆనందం వ్యక్తం చేశారు. నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు పురస్కారాలు దక్కడం పట్ల ఆయన హర్షం ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రజాకవి గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ అవార్డులు ఏర్పాటు చేసి, ఆయన గౌరవాన్ని మరింత పెంచిందని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతి వంటి అంశాలపై ఉత్తమ చిత్రంగా అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే, ఈ చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా అవార్డు రావడం అతని ప్రతిభకు దక్కిన ప్రోత్సాహమని అభిప్రాయపడ్డారు. తాను తొలిసారిగా నిర్మించిన ‘రుద్రవీణ’ చిత్రానికి జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రంగా నర్గీస్ దత్ అవార్డు లభించిందని, ఇప్పుడు అదే తరహాలో తన కుమార్తె నిర్మించిన తొలి చిత్రానికీ అలాంటి గౌరవం దక్కడం యాదృచ్ఛికమని, సంతోషకరమైన సంఘటన అని నాగబాబు అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక, దర్శకుడు యదు వంశీతో పాటు చిత్ర యూనిట్‌లోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :