Sunday, 25 January 2026 05:35:17 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

10 కోట్ల సినిమాకి 55 కోట్ల వసూళ్లు!

మలయాళంలో రూపొందిన 'సూక్ష్మదర్శిని' నవంబర్లో విడుదలైన సినిమా ప్రధాన పాత్రల్లో బాసిల్ జోసెఫ్ - నజ్రియా జీ 5లో జనవరి నుంచి మొదలయ్యే స్ట్రీమింగ్

Date : 24 December 2024 04:01 PM Views : 367

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళంలో ఈ ఏడాది భారీ హిట్లు పడ్డాయి. తక్కువ బడ్జెట్ లో నిర్మితమై, భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలే వాటిలో ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో 'సూక్ష్మదర్శిని' ఒకటిగా చెప్పుకోవచ్చు. బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా ఇది. బాసిల్ జోసెఫ్ - నజ్రియా నజీమ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి జితిన్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది నవంబర్ 22వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లలో విడుదలైంది.10 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 55 కోట్లను వసూలు చేయడం విశేషం. అలాంటి ఈ సినిమా జనవరి 2వ వారంలో గానీ, 3వ వారంలో గాని 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది. నజ్రియాకి మలయాళంలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. కొంత గ్యాప్ తరువాత అక్కడ ఆమె చేసిన సినిమా ఇది. మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లోను ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ప్రియా (నజ్రియా)కి పక్కింట్లో వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? అనేది తెలుసుకునే యావ ఎక్కువగా ఉంటుంది. అలా ఆమె మాన్యుయేల్ ఫ్యామిలీపై దృష్టిపెడుతుంది. ఆయన ప్రవర్తన అనుమానాన్ని కలిగించడంతో మరింత దృష్టి పెడుతుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అనేది కథ. ఈ తరహా కంటెంట్ కి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Also Read : పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :