Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భైరవం. ఈ మూవీని ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా నుంచి బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. తాజాగా మంచు మనోజ్ మాసీ లుక్ విడుదలైంది. పోస్టర్‌లో లుంగీపై దర్శనమిచ్చాడు మంచువారబ్బాయి. ఇక పోస్టర్ చూస్తుంటే మాస్ ఫీస్ట్‌లా మనోజ్ పాత్ర ఉండబోతుందని అర్థమవుతోంది. ఇందులో మనోజ్ గజపతిగా కనిపించబోతున్నాడు. భారీ వర్షంలో కారు, దాని పక్కనే గొడుగులు పట్టుకొస్తున్న జనాలు, వారి ముందు ఆవేశంగా నడుచుకుంటూ వస్తున్న గజపతి లుక్ చిత్రంపై ఆసక్తిని పెంచుతుంది. థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్‌డ్ డ్రామా అయిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల బాణీలు అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై దీనిని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.
Also Read : ఆరెంజ్ జ్యూస్ తాగడానికి వెళ్లిన మహిళకు రూ.2.10 కోట్లు
Admin
Studio18 News