Sunday, 08 February 2026 11:45:11 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

National Crush | నేష‌న‌ల్ క్ర‌ష్‌గా ర‌ష్మిక ఔట్.. ఇంటర్నేషనల్ క్రష్ గా మ‌రో క‌న్న‌డ బ్యూటీ..!

National Crush | క‌న్నడ చిత్ర పరిశ్రమ నుంచి వ‌చ్చిన‌ మరో స్టార్ హీరోయిన్ ఇప్పుడు త‌న హ‌వా చాటుతుంది. 'సప్త సాగరదాచె ఎల్లో' సినిమాతో పరిచయమై, ‘కాంతార ఛ

Date : 11 October 2025 07:42 PM Views : 207

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : National Crush | క‌న్నడ చిత్ర పరిశ్రమ నుంచి వ‌చ్చిన‌ మరో స్టార్ హీరోయిన్ ఇప్పుడు త‌న హ‌వా చాటుతుంది. ‘సప్త సాగరదాచె ఎల్లో’ సినిమాతో పరిచయమై, ‘కాంతార ఛాప్టర్ 1’లో కనకవతి పాత్రలో నటించిన రుక్మిణి వసంత్ ఇప్పుడు నేషనల్‌ స్థాయిని దాటి ఇంటర్నేషనల్ క్రష్‌గా మారిపోయారు. ‘కాంతార ఛాప్టర్ 1’ బ్లాక్‌బస్టర్ విజయంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన కాంతార చాప్ట‌ర్ 1 చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కన్నడ సినిమా రంగంలో ఇదొక అరుదైన రికార్డు. అద్భుతమైన కథ, దృశ్యకావ్యం లాంటి విజువల్స్‌తో పాటు, రుక్మిణి వసంత్‌ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ‘నేషనల్ క్రష్’గా రష్మిక మందన్న పేరు వినిపిస్తుండగా, ఇప్పుడు ఆ స్థానం రుక్మిణికి చెందిందని నెటిజన్లు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఆమెను కర్ణాటక క్రష్, కన్నడ క్రష్, ఇంటర్నేషనల్ క్రష్ అంటూ పిలుస్తున్నారు. రష్మిక మందన్నపై ఇటీవల కన్నడ ప్రేక్షకుల్లో కొంత వ్యతిరేకత నెలకొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రుక్మిణి వసంత్‌ ‘కాంతార 2’ విజయంతో వెలుగులోకి రాగా ఆమెను రష్మికకు బదులుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నార‌న్న‌ వార్తల నడుమ, ఆమె వెనుకబడతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం రుక్మిణి వసంత్‌ తమిళ, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ‘కాంతార 2 ‘ విజయంతో ఆమె కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలైందనడంలో సందేహమే లేదు. ఇక రష్మిక మందన్న స్థాయిని రుక్మిణి వసంత్ చేరతారా? లేక ఈ క్రేజ్ తాత్కాలికమా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా ర‌ష్మిక మంద‌న్నా క్రేజ్ ఇప్పుడు ఏమి త‌గ్గ‌లేదు. ఆమెకి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. చేసిన ప్ర‌తి సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తూనే ఉంది. మ‌రి ర‌ష్మిక‌, రుక్మిణి ఫైట్‌లో గెలుపెవ‌రిదో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :