Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mithun Chakraborty : సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈ ఏడాది ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుకలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నట్లు కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశౄరు. ‘‘మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించింది’’ అని వైష్ణవ్ సోషల్ మీడి్యాలో రాసుకొచ్చారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించారు. హీరోగానే కాకుండా సహాయనటుడిగా, విలన్‌గా తనదైన ముద్ర వేశాడు. 1976లో ‘మృగాయ’తో నటుడిగా మారారు. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. హిందీలోనే కాకుండా బెంగాలీ, కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్‌పురి బాషల్లోనూ ఆయన నటించారు. తన కెరీర్‌లో మూడు సార్లు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు.
Admin
Studio18 News