Thursday, 12 March 2026 03:15:57 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

మహేష్ బాబు బిజినెస్ ప్లాన్.. 'AMB'లోకి మరో స్టార్ ఫ్యామిలీ!

ఇప్పుడు, అదే సక్సెస్ ఫార్ములాను తెలుగు సినిమాకు గుండెకాయ లాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రిపీట్ చేయడానికి మహేష్ ఏషియన్ సునీల్ టీమ్ రెడీ అయింది.

Date : 30 October 2025 07:58 PM Views : 317

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం నటనలోనే కాదు, బిజినెస్ స్ట్రాటజీలలో కూడా 'సూపర్ స్టార్' అనిపించుకుంటున్నారు. ఆయన ఏషియన్ సునీల్‌తో కలిసి గచ్చిబౌలి శరత్ సిటీ మాల్‌లో స్థాపించిన 'AMB థియేటర్' ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగ్జరీ సినిమా ఎక్స్‌పీరియన్స్‌కు ఇది కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇప్పుడు, అదే సక్సెస్ ఫార్ములాను తెలుగు సినిమాకు గుండెకాయ లాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రిపీట్ చేయడానికి మహేష్ ఏషియన్ సునీల్ టీమ్ రెడీ అయింది. "AMB క్లాసిక్" పేరుతో ఇక్కడ ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారని, Tupaki.com గతంలోనే రిపోర్ట్ చేసింది. ఇక లేటెస్ట్ గా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో 'క్లాసిక్' అప్‌డేట్ బయటకు వచ్చింది

ఈ బిజినెస్ వెంచర్‌లో ఇప్పుడు టాలీవుడ్‌లోని మరో పవర్ ఫుల్ స్టార్ ఫ్యామిలీ జాయిన్ అవుతోందట. ఆ ఫ్యామిలీ మరెవరో కాదు, దగ్గుబాటి ఫ్యామిలీ. అవును, సురేష్ బాబు, రానా, వెంకటేష్‌ల కుటుంబం కూడా ఇప్పుడు ఈ "AMB క్లాసిక్" ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవుతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇది ఇండస్ట్రీలో చాలా పెద్ద బిజినెస్ డీల్‌గా చెప్పుకోవచ్చు. ఘట్టమనేని, నారంగ్ (ఏషియన్), ఇప్పుడు దగ్గుబాటి.. ఇలా మూడు బలమైన సినిమా కుటుంబాలు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాయంటే, అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రూపురేఖలనే మార్చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏషియన్ సునీల్‌కు, దగ్గుబాటి ఫ్యామిలీకి థియేటర్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. గతంలో చాలాసార్లు వీరి మధ్య డీలింగ్స్ జరిగాయి.

ఇక గచ్చిబౌలిలోని 'AMB థియేటర్' హై క్లాస్, లగ్జరీ ఆడియెన్స్‌ను ఎక్కువగా టార్గెట్ చేసింది. కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని 'AMB క్లాసిక్' మాత్రం అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ 'క్లాసిక్' థియేటర్ వైబ్‌ను మిస్ అవ్వకుండా, అదే సమయంలో మోడ్రన్ టెక్నాలజీతో, మాస్, క్లాస్ ఆడియెన్స్‌కు బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మహేష్ బాబు బ్రాండ్ వాల్యూతో పాటు ఏషియన్ సునీల్ దగ్గుబాటి ఫ్యామిలీ అనుభవం 'AMB క్లాసిక్' కు మంచి క్రేజ్ దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు ఒక ల్యాండ్‌మార్క్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :