Monday, 19 January 2026 08:31:56 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Nara Rohit: రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన నారా రోహిత్

Date : 24 October 2025 08:07 PM Views : 331

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నటి శిరీష లేళ్లతో అక్టోబర్ 30న నారా రోహిత్ వివాహం హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు ఘనంగా పెళ్లి వేడుకలు ‘ప్రతినిధి-2’ సినిమా సెట్స్‌లో ఇరువురి మధ్య చిగురించిన ప్రేమ టాలీవుడ్ హీరో నారా రోహిత్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. నటి శిరీష లేళ్లతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న రోహిత్.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలను నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నారా కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 25న హల్దీ, 26న సంప్రదాయబద్ధంగా పెళ్లికొడుకు కార్యక్రమం, 28న మెహందీ వేడుకలు జరగనున్నాయి. ఇక అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు శుభ ముహూర్తాన రోహిత్, శిరీష ఒక్కటవ్వనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. ‘ప్రతినిధి–2’ సినిమా షూటింగ్ సమయంలో రోహిత్, శిరీష మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూయడంతో పెళ్లి వాయిదా పడింది. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి తేదీ ఖరారు కావడంతో నారా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. రోహిత్ స్వయంగా రాజకీయ, సినీ ప్రముఖులను కలిసి శుభలేఖలు అందిస్తూ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :